బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న నందమూరి తారకరత్న ఆరోగ్యంపై నందమూరి రామకృష్ణ అప్డేట్ ఇచ్చారు. తారకరత్న కోలుకుంటున్నాడని, సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాడని వెల్లడించారు. సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని, ఎక్మో అసలు పెట్టలేదని స్పష్టం చేశారు. తారకరత్న పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. తారకరత్నకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. హార్ట్ స్పెషలిస్టులతో పాటు న్యూరాలజిస్టులు తారకరత్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.’’ అని చెప్పారు. అలాగే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సినీ నటుడు బాలకృష్ణ కూడా స్పందించారు. తారకరత్న ఆరోగ్యంలో మార్పులు తమలో విశ్వాసాన్ని పెంచాయని, రెండు సార్లు తారకరత్న శరీరంపై గిచ్చినప్పుడు ఓసారి స్పందించారని, కళ్లలోనూ కదలికలు చూశానని తెలిపారు. అంతర్గత రక్తస్రావం,శరీరంలో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు చెప్పారని వివరించారు.
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది.
ఇవి కూడా చదవండి…