దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టారర్‌లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమ జపాన్‌లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి జపాన్‌కు బయలుదేరారు. అక్టోబర్ 21న జపాన్‌లో RRR మూవీ రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్ కోసం చరణ్, తారక్ జపాన్ వెళ్లారు. ఈ సందర్భంలో ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కొత్త లుక్ బయటకు వచ్చింది. ఆయన స్టైలిష్ లుక్ చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను కొరటాల దర్శకత్వంలో చేస్తుండగా ఈ లుక్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల శివ ఇప్పటికే తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్‌ను రీ రైట్ చేస్తున్నారని.. నవంబర్‌లో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని టాక్. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతన్న చిత్రం ఇది.

