రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు తారా ఆర్ట్స్ అకాడమీ సభ్యులు. వివిధ వర్గాల ప్రజలు ఏ మంచి సందర్భం వచ్చిన పాల్గొని మొక్కలు నాటే చైతన్యాన్ని తీసుకువస్తుందని.ఇందులో భాగంగా తారా ఆర్ట్స్ అకాడమీ వారు అండమాన్ లో నిర్వహించిన సంస్కృతి కళోఉత్సవం పోర్ట్ బ్లెయిర్ 2021 (Port Blair2021) సందర్భంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈవిషయాన్ని ఈరోజు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడ కోసం కృషి చేస్తున్నారని అభినందించి సంస్థ తరుపున సంతోష్ గారికి జ్ఞాపికను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రాజేష్, రోజా రమణి నటి డాన్సర్, లీలా రాజ్ (మిథాలీ రాజ్ తల్లి), జూపల్లి మంజులా రావు, మేజర్ జయసుధ NCC తదితరులు పాల్గొన్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం కు ముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి నందుకు తారా ఆర్ట్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు సంతోష్ కుమార్.