భయపెట్టేందుకు వస్తున్న తాప్సీ…!

311
Tapsi In A Horror Movie?
- Advertisement -

తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగులో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడికి ఇంతవరకు సరైన హిట్ లేదు. ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళ్,బాలీవుడ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్ లో సక్సెస్ కొట్టేసి మహా జోరు మీద ఉంది. అయితే.. తను అరంగేట్రం చేసిన.. అసలు సినిమాల్లో అవకాశం ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ మధ్య కొన్నేళ్లుగా ట్యాలెంట్ చూపించలేదు తాప్సీ.

మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన గోపీచంద్ మూవీ సాహసం తర్వాత లారెన్స్ సినిమాలో నటించింది తాప్సీ. తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో దొంగాటలో ఓ కేమియో ఇచ్చిందంతే. ప్రస్తుతం దగ్గుబాటి రానాతో ఘాజీలో నటిస్తున్నా.. ఇది హిందీ.. తెలుగు బై లింగ్యువల్. కానీ ఇన్నేళ్లకు తాప్సీ ఓ తెలుగు సినిమా యాక్సెప్ట్ చేయడం విశేషం. పాఠశాల ఫేమ్ మహి రాఘవ్ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ హారర్ కామెడీలో నటించేందుకు తాప్సీ సైన్ చేసిందట.

హారర్ జోనర్ కొత్త యాంగిల్ చూపించేందుకు ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నయనతార, త్రిష, అనుష్క, అంజలి, ఇలా చాలా మంది హర్రర్ సినిమాల్లో నటించేశారు. ఇప్పుడు ఇక తాప్సీ వంతు అన్నమాట.జనవరిలో ప్రారంభమయ్యే ఈ సినిమాను మార్చినాటికి ఫినిష్ చేసి, సమ్మర్ లో పెద్ద సినిమాల మధ్య గ్యాప్ లో వదిలేయాలని షెడ్యూలు కూడా డిసైడ్ చేసుకున్నారట. సాహసం అంటూ ఓ థ్రిల్లర్ చేసిన తరువాత తాప్సీ మరోసారి తన అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.

- Advertisement -