బికినీతో నమ్మకం వచ్చేసిందా..!

221
Tapsee feels more confident in Bikini
Tapsee feels more confident in Bikini
- Advertisement -

తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ బ్యూటి తాప్సీ. గతంలో తెలిసీ తెలియక గ్లామరస్‌ షో చేసేశాను.. ఇకపై అలాంటి అందాల ప్రదర్శన చేయబోను..’ అంటూ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో గ్లామర్‌కి వ్యతిరేకంగా ఎడా పెడా కామెంట్లు చేసేసిన తాప్సీ, ‘జుడ్వా-2’ సినిమా కోసం మాత్రం, గ్లామర్‌ హద్దులు చెరిపేసింది. . అంతే ఇక ట్విట్ట‌ర్‌లో తాప్సీపై నెటిజ‌న్స్ ఫైర్ మొదలైంది. టు-పీస్ బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని తిట్టిపోశారు. దీంతో స్పందించిన తాప్సీ.. తాను బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నించింది. మహిళల సొంత అభిప్రాయాలను ప్రజలు ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు.. అనే విషయాలను భారతీయ మహిళలకు పుట్టినప్పటి నుంచే నేర్పిస్తున్నారని ఘాటుగా స్పందించింది. అప్పటి వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, సడెన్‌గా బికినీ ధరించగానే సంస్కృతికి వ్యతిరేకం ఎలా అవుతుందని నిలదీసింది.

భారతీయురాలినైనందుకు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తున్నందుకు సిగ్గుపడడం లేదని స్పష్టం చేసింది తాప్సీ. అప్పట్లో మహిళలు కూడా కురచ దుస్తులు ధరించారని, చాలా చిన్న జాకెట్లు, బికినీ బ్లౌజులు ధరించేవారని, అయినా వారిని అప్పుడు ఆరాధించిన వారు.. ఇప్పుడు తాను ధరిస్తే సరికాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

‘ హీరోయిన్లు లోదుస్తులు (లింగేరీ) ధరించి తెరపై కనిపించకపోవడం తనకు ఇప్పటికీ ఆశ్చరంగా ఉంటుందని తాప్సీ పేర్కొంది. తానైతే లింగేరీ ధరించడాన్ని ఇష్టపడతానని పేర్కొంది. వాటిని ధరించినప్పుడు ఆ రోజంతా తనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని తాప్సీ సెలవిచ్చింది. ‘బికినీ ధరించడానికి శరీరం అనువుగా ఉంటే ఆ విషయంలో ఇక ఆలోచించాల్సిన పనిలేదు. అందులో తప్పేముంది’’ అని తాప్సీ ప్రశ్నించింది. నటనతో రానీ ఆత్మవిశ్వాసం, బికినీతో వచ్చిందని తాప్సీ అనడంపై ఎలాంటి విమర్శలు వస్తోయో చూద్దాం..

- Advertisement -