ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూపించారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఈ చిత్రం లో కొత్తగా చూపించారు.
మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ.. గ్లామర్ పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తాప్సీకి, ఆ తరువాత అంతగా అవకాశాలు రాలేదు. దాంతో కొంతకాలంపాటు కోలీవుడ్ లో ట్రై చేసి ..ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అదృష్టం బాగుండి ఆమెకి మంచి హిందీ సినిమాలు పడ్డాయి .. అవి విజయాలను తెచ్చిపెట్టాయి. ఆ విజయోత్సాహంతో ఆమె టాలీవుడ్ పై కొన్ని విమర్శలు చేసింది కూడా.
మళ్లీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో తెలుగులో ఛాన్స్ రావడంతో, తాను చేసిన విమర్శలను మరిచిపోయింది. ‘ఆనందో బ్రహ్మ’ థియేటర్లలో సందడి చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక పై గ్యాప్ తీసుకోకుండా వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని చెప్పింది. ఏమైనా, తాప్సీకి ఇక్కడి దర్శక నిర్మాతలు గ్యాప్ ఇస్తే .. తానే గ్యాప్ తీసుకున్నట్టుగా ఆమె మాట్లాడటం విచిత్రం. తాను వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది సరే .. కానీ ఇచ్చేవారేరి? అనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్.