25 సంవత్సరాల తర్వాత ఛాన్స్ దక్కింది!

94
- Advertisement -

25 సంవత్సరాల తర్వాత మణిరత్నం సినిమాకి డైలాగ్స్ రాశానని తెలిపారు తనికెళ్ళ భరణి. దళపతి సినిమాలో ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇన్నాళ్ళకి మణిరత్నం సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. రెండు పార్టులుగా ఈ సినిమా రిలీజ్ కానుండగా తొలిపార్టు సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన తనికెళ్ళ… ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాయడానికి రీసెర్చ్ చేశాను. అందరూ కలలు కంటారు, కానీ అది సాకారం చేసుకున్నారు మణిరత్నం అన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్లు కనపడుతాయి కానీ హీరోలు కనపడరు. ఇది చాలా అద్భుతమైన సినిమా అన్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళిపోతామని వెల్లడించారు.

- Advertisement -