ప్రభుత్వానికి మా సంపూర్ణ సహకారం- తమ్మినేని

195
tammineni veerabhadram
- Advertisement -

సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కం విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌పై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అఖిల‌ప‌క్ష భేటీ జ‌రిగింది. రాష్ట్రంలోని నిరు పేద ఎస్సీ కుటుంబాలను అన్ని రంగాల్లో దశల వారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దళిత సాధికారత పథకాన్ని అమలు చేయాల‌ని భావిస్తోన్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ దాని విధివిధానాల కోసం ఎస్సీ ప్రజాప్రతినిధులు, నేతలతో అఖిలపక్ష సమావేశంలో చ‌ర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ, మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం అనంతరం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు.

తమ్మినేని మాట్లాడుతూ.. దళిత సాధికారత కోసం, సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నది. మరియమ్మ లాకప్ డెత్ కేసులో, వారి కుటుంబానికి సహాయం చేస్తూ.. సీఎం కేసీఆర్ తక్షణ స్పందన..తీసుకున్న నిర్ణయాలు, దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని తమ్మినేని తెలిపారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్దితో అమలు పరచాలి. ప్రభుత్వానికి మా సంపూర్ణ సహకారం వుంటుందన్నారు తమ్మినేని వీరభద్రం

- Advertisement -