కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న NBK 108 సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ వస్తే.. తమన్నా భారీగా పారితోషికం అడిగారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తమన్నా స్పందించారు. ‘అనిల్ తో వర్క్ చేయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక బాలకృష్ణ గారంటే నాకెంతో గౌరవం. సాంగ్ గురించి వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నిరాధార ఆరోపణలు చేసే ముందు ఓ సారి తెలుసుకోండి’ అని తమన్నా ట్వీట్ చేశారు. ప్రస్తుతం తమన్నా ట్వీట్ వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్యతో కాజల్ అగర్వాల్ లవ్ ట్రాక్ ఈ సినిమాలో ఓ స్పెషలాఫ్ అట్రాక్షన్ కాబోతోందట. ఈ లవ్ సీన్స్ ను షూట్ చేయడానికి ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. బాలయ్య – కాజల్ అగర్వాల్ లవ్ ట్రాక్ ని ఈ సెట్ లోనే తెరకెక్కించనున్నారు. బాలయ్య – కాజల్ మధ్య తెరకెక్కించే సీన్లు చాలా ఎంటర్ టైన్ గా ఉంటాయట. అన్నట్టు ఆ తరవాత జరగనున్న షెడ్యూల్‌లో బాలయ్యపై హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Also Read: హృతిక్, బన్నీ ట్వీట్స్ వైరల్
ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బాలయ్య సినిమాను ఏకంగా రూ. 36 కోట్లు ఇచ్చి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , శ్రీలీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read: SURIYA:నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు