కేరళ బాటలో తమిళనాడు..!

154
ott
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడగా ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో పలువురు ప్రముఖులు ఓటీటీ బిజినెస్‌లో అడుగుపెట్టి రాణిస్తున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, తెలుగులో ‘ఆహా’ వంటి ఓటిటి వేదికలు ముందువరుసలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం త్వరలోనే సొంత ఓటీటీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా చిన్న-బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలపగా తాజాగా తమిళనాడు కూడా అదేబాటలో నడవనుంది.

చిన్న తరహా చిత్రనిర్మాతలకు మద్దతు ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి, చిన్న తరహా చిత్రాలను ప్రసారం చేయనుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

- Advertisement -