హత్యే జరగలేదు…రెండేళ్ల జైలు శిక్ష!

9
- Advertisement -

చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు ఓ వ్యక్తి. అసలు హత్యే జరగలేదు…దీంతో తనకు పరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని కోర్టులో కేసు దాఖలు చేశారు. కర్ణాటక-కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన.

తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు కురుబర సురేశ్ అనే వ్యక్తి. ఇటీవల అతడి భార్య సజీవంగా కనిపించడంతో కేసులో ట్విస్ట్.

2025, ఏప్రిల్ నెలలో సురేశ్‌ని నిర్దోషిగా విడుదల చేసింది మైసూరులోని 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు. కోర్టు అతడికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కర్ణాటక హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆ డబ్బులపై సంతృప్తి చెందని సురేశ్.. హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యలను కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు సురేశ్.

Also Read:TTD:కోదండరామ స్వామి విశేష ఉత్సవాలు

- Advertisement -