సీఎం కేసీఆర్‌తో తమిళనాడు అధికారుల భేటీ

387
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌తో తమిళనాడు అధికారులు భేటీ అయ్యారు. తమిళనాడుకు తాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. తమిళనాడు సీఎం నుంచి తెలంగాణ,ఏపీ ముఖ్యమంత్రులకు అధికారికంగా ఒక లేఖ రాయాలని వారికి సూచించారు. తమిళనాడు ప్రతిపాదన అందిన తర్వాత మూడు రాష్ట్రాల అధికారులు,నిపుణుల స్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. మూడు రాష్ట్రాల అధికారులు,నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలవనున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. తాగునీటి అవసరాల విషయంలో రాష్ట్రాల మధ్య సహనపూరిత వాతావరణం ఉండాలని తమిళనాడు బృందంతో సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -