గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై..

363
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్ ఈ రోజు గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

kcr

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో తమిళిసైతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు.ప్రమాణస్వీకారం చేసిన తర్వత తమిళిసై ఆమె తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది.

kcr

ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 1100 మంది అతిథులను ఆహ్వానించింది. సీఎం కేసీఆర్‌తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.

- Advertisement -