బీజేపీలో చేరిన తమిళి సై..

30
- Advertisement -

మాజీ గవర్నర్ తమిళి సై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తిరిగి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు తమిళి సై.

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేకంటే ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు తమిళి సై. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది కేంద్రం.

ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుండి తమిళి సై ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది.

Also Read:తొలి విడత …నోటిఫికేషన్‌ జారీ

- Advertisement -