ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా – తమిళి సై మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తమిళి సైకి షా క్లాస్ ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఉండగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు తమిళి సై.
ఎక్స్ ద్వారా స్పందించిన తమిళి సై.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమిత్ షాను కలిశానని, ఎన్నికల తర్వాత చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించుకున్నట్లు తెలిపారు.ఎన్నికల సమయంలో జరిగిన అంశాల గురించి తెలియజేస్తున్న సమయంలో.. షా తనకు దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృత స్థాయిలో రాజకీయ, సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని షా సూచించారని చెప్పి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.
గవర్నర్ పదవికి రాజీనామా చేసి దక్షిణ చెన్నై సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళిసై సౌందర్యరాజన్ పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి తంగపాండియన్ చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు.
Also Read:వైఎస్‌ఆర్ పెన్షన్ కాదు..ఎన్టీఆర్ భరోసా