కాలా ప్లాఫ్‌ కావడానికి రజనీనే కారణం…

262
Vijay-with-Father
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ప్లాఫ్ కావడాని రజనీకాంతే కారణమని వ్యాఖ్యానించారు తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్. భారీ అంచనాల మధ్య విడుదలైన కాలా, తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలే ఆయన సినిమా పరాజయం అయ్యేలా చేశాయన్నారు. ప్రజల సమస్యలపై సినిమాలు తీయడం నటుడి బాధ్యత అని, రజనీకాంత్ కాలా చిత్రం ఆ కోణంలోనిదే అని అన్నారు.

kaala

సినీ ప్రముఖులు కొత్త పార్టీలు స్థాపించినప్పటికీ… వారు సినిమా వేరు.. రాజకీయం వేరు అని తెలుసుకునే లోపు వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్ధంగా మారుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందుకే తన కుమారుడు విజయ్ ని రాజకీయాలలోకి రానివ్వడం లేదని చెప్పుకొచ్చారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన కాలా, కబాలి కంటే బాగుందని టాక్ వినిపించింది. కానీ కబాలి రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంలో కాలా విఫలమైందనే చెప్పాలి. రజనీ వ్యాఖ్యలకుగాను కన్నడనాట కాలా విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్స్ తగ్గడంలో ఇది ఒక కారణంగానే చెప్పాలి. ఇక రజనీ ఆశలన్నీ 2.0 సినిమాపైనే పెట్టుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రోబోకి సీక్వెల్ గా రానుంది. ఈ సినిమాతో ఇటు రజనీ, అటు శంకర్ ఇద్దరూ మరో హిట్ అందుకుంటారో లేదో చూడాలి ఇక.

- Advertisement -