తమిళనాడులో హై అలర్ట్‌..

277
Tamil Nadu Police no holidays
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమెను అపోలో ఆసుపత్రిలోని ఐసీయు వార్డుకు తరలించారు. జయకు గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన గురివుతున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అపోలో ఆస్పత్రికి పెద్ద ఎత్తున్న అమ్మ అభిమానులు తరలి రావడంతో పరిస్థితిని సమీక్షించిన డీజీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశించారు.

 diuygpevdl-1474641314

ఈ నేపథ్యంలోనే పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ తమిళనాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న వారిని వెంటనే విధుల్లోకి హాజరు కావలని ఆయన ఆదేశించారు. తమిళనాడులో మండల స్థాయి నుంచి భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సరిహద్దు ప్రాంతాలు, టోల్ ప్లాజాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జయలలిత అనారోగ్య కారణంగా తమిళనాడుపై పోలీసులు నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, కేంద్ర బలగాలను తమిళనాడులో మోహరించాయి. అపోలో ఆస్పత్రికి 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటళ్లను, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. అలాగే కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు తమిళనాడు డీజీపీతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

Tamil Nadu Police

ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు సోమవారం రోజున బంద్ ప్రకటించాయి. రాజధాని చెన్నై నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున బలగాలను మొహరించాయి. మరోవైపు కేంద్రం నుంచి అదనంగా ప్రత్యేక బలగాలు తమిళనాడుకు బయలుదేరాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులను అక్కడి అధికారులు రద్దు చేశారు.

- Advertisement -