టిక్‌ టాక్‌ వివాదంపై స్పందించిన హైకోర్టు..

251
TikTok
- Advertisement -

టిక్‌ టాక్‌ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌, యాపిల్‌ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్‌ యాప్‌పై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో దీన్ని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్ వల్ల పిల్ల‌ల్లో అశ్లీల ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోల‌ను వాడ‌రాదంటూ మీడియాకు కూడా ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -