శివకార్తికేయన్ ‘మిస్టర్ లోకల్’ టీజర్

278
mr. local
- Advertisement -

శివ‌కార్తికేయ‌న్, న‌య‌న‌తార జంటగా నటించిన సినిమా మిస్టర్ లోకల్. ‘ఓకే ఓకే ‘ఫేమ్ దర్శకుడు ఎమ్ రాజేష్ ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్ర టీజర్ ను విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార కెవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సిఇఒ కీర్తన వాసుదేవన్‌గా న‌టించారు.

మే1న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ సగం వరకూ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈచిత్రానికి హిప హాప్ సంగీతం అందిస్తున్నారు. ‘నా పేరు మనోహర్‌. నన్ను అందరూ మిస్టర్‌ లోకల్‌ అని పిలుస్తుంటారు’ అంటూ కార్తికేయన్‌ ఫైటింగ్‌ చేస్తూ చెబుతున్న డైలాగులతో టీజర్‌ మొదలైంది. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రిమది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ చిత్రంలో జంటగా నటించారు.

- Advertisement -