నటుడు వివేక్ కన్నుమూత…

282
vivek
- Advertisement -

ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఇక లేరు. శుక్రవారం గుండెపోటు రావడంతో చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్‌ వేసి చికిత్స అందిస్తుండగా శనివారం తెల్లవారు జామున 4.35 గంటలకు మరణించారని వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. త తర్వాత సినిమాలకు ఎక్కువగా చేయడం లేదు.

దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించాడు వివేక్. 2009లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నాడు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్, విశాల్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన వివేక్ త‌మిళంలో టాప్ క‌మెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

- Advertisement -