చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

53
- Advertisement -

వంటింట్లో నిత్యం ఉపయోగించే పదార్థాలలో చింతపండు కూడా ఒకటి. రుచిలో పుల్లగా ఉన్నప్పటికి కూరలకు మాత్రం అద్భుతమైన రుచిని అందిస్తుంది. పులిహోర తయారీలో చింతపండు వేస్తే ఆ రుచి అమోఘం. కూర ఏదైనా వంటకం ఏదైనా చింతపండు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే చింతపండుకు ఉండే పులుపు కారణంగా కొంతమంది దీనిని ఆహారంలో ఉపయోగించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. తినే ఆహారంలో చితపండు చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. చింతపండులో మన శరీరానికి అవసరమైన పోషకాలు చాలానే ఉన్నాయి. ఇందులో విటమిన్ సి మెండుగా ఉంటుంది.

ఇంకా విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. మలబద్దకంతో బాధపడే వారు తప్పనిసరిగా తినే ఆహారంలో చింతపండు చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్, ఫాలిఫెనొలిక్ సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను ఎంతో మెరుగుపరిచి అల్సర్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాకుండా మోషన్ ఫ్రీ అయ్యేలా కూడా చేస్తాయి.

ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఇంకా చింతపండులో ఉండే ఇతరత్రా పోషకాలు శీతాకాలంలో వచ్చే వైరల్ ఫ్లూ లను ఎదుర్కొనేందుకు శక్తినిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినే వంటకాల్లో చితపండు ఉపయోగించడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.

Also Read:మంత్రులుగా పవన్,లోకేష్..జాబితా ఇదే

- Advertisement -