సౌత్ మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల పరంగా అమ్మడు అపజయలను చూసింది గాని తన అందంతో ఏనాడు ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయలేదు. టాలీవుడ్ లో దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న మిల్కీ పరభాషా స్టార్ హీరోలను కూడా చాలా వరకు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కుర్ర హీరోయిన్స్ ఎంతగా పోటీ ఇస్తున్నా సరికొత్తగా కనిపిస్తూ తన టాలెంట్ ను చూపిస్తోంది.

కేవలం సినిమాల వరకే తమన్నా పరిమితం అనుకుంటే పొరపాటే. యాడ్స్ లలో కూడా కనిపిస్తోంది. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది. ఇక అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ రెమ్యునరేషన్ ని భారీ స్థాయిలో అందుకుంటోంది. అన్ని విధాలుగా మిల్కీ తన ఆదాయాన్ని పెంచుకుంటోంది. తాజాగా కన్నడ లో ఒక కొత్త యాడ్ లో ఈమె కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించింది. ఈ యాడ్ తాలూకు కొన్ని ఫోటో లలో ఈమె ఒక దేవకన్య లాగా అందంగా కనిపిస్తోంది. పట్టు చీర కట్టుకుని తలపై ఓని కప్పుకుని ఒళ్ళంతా నగలతో దగా దగా మెరిసిపోతోంది. పక్కనే పునీత్ రాజ్ కుమార్ కూడా షేర్వాని లో నవ్వుతూ నిలబడ్డాడు.యాడ్ లొనే కెమిస్ట్రీ ఆదరగొట్టేసిన వీళ్ళు నిజంగానే సినిమా చేస్తే అదుర్స్ అని ముందే జాతకం చెప్పేస్తున్నారు ఫాన్స్.

