- Advertisement -
మిల్కీ బ్యూటీ తమ్మన్నా సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఘాటైన ట్వీట్ చేసింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా బాలికలపై, యువతులపై దాడులు జరుతుంటే ఈ దేశం ఏం చేస్తుందని ప్రశ్నించింది. జమ్మూకాశ్మీర్‌లో 8 ఏళ్ల బాలిక రేప్‌కు గురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ 16 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనను నిరసిస్తూ.. న్యాయం కోసం పోరాడుతూ ఆమె తండ్రిని కోల్పోయింది. ఈ దేశం ఎటుపోతుంది? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంస్కరణలు తెచ్చేందుకు ఇంకెంత మంది నిర్భయలు ప్రాణత్యాగం చేయాలంది. కనీసం తన మహిళలను కాపాడుకోలేని దేశం కూడా ఓ దేశమేనా? మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ దేశానికి చికిత్స అవసరమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) April 12, 2018
- Advertisement -