తమన్నాకి రొమాన్స్ బాగా ఇష్టమట!

50
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తనకు పిచ్చి అని నటుడు విజయ్ వర్మ అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ‘తమన్నా అంటే నాకు ఎంతో ఇష్టం. మేమిద్దరం డేటింగ్‌ లో ఉన్నామని మాకు బాగా అర్ధమవుతోంది. ఆమెతో చాలా సంతోషంగా ఉన్నా. ఆమె రాకతో నా జీవితంతో విలన్ దశ ముగిసి రొమాంటిక్ దశ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తమన్నాతో రొమాన్స్ ఎలా ఉంటుంది ? అంటూ యాంకర్ అడగగా.. తమన్నాకి రొమాన్స్ బాగా ఇష్టం. ఆమె నాతో చాలా రొమాంటిక్ గా ఉంటుంది అని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.

కాగా తమన్నా, విజయ్ కలిసి ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్2’లో నటించారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమన్నా కూడా విజయ్ వర్మతోనే కలిసి ఉంటుంది. ఆ మధ్య అయితే తమన్నా గర్భవతి అయింది అని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ పై కూడా విజయ్ వర్మ మాట్లాడాడు. తమన్నా గర్భవతి కాలేదు అని, తాము జాగ్రత్తలు తీసుకున్నాం అని, కాబట్టి.. తమన్నా అలా గర్బవతి అయ్యే ఛాన్స్ లేదు అని విజయ్ వర్మ తెలిపాడు.

Also Read:చిక్కుల్లో మెగాహీరో సాయిధరమ్!

ఇక సినిమాల విషయానికి వస్తే.. నటుడు జాన్ అబ్రహంతో తమన్నా తొలిసారిగా నటిస్తున్నారు. నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదా చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిఖిల్ కథ చెప్పే విధానంలో మంచి నేర్పు ఉందని అన్నారు. జాన్ తో తొలిసారిగా నటిస్తున్నామని, ఇందులో తన పాత్ర ఎలా ఉంటుందో ఉత్సాహంగా ఉందని తెలిపారు. శర్వరి వాగ్, అభిషేక బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ వర్మ కూడా రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read:‘నాయకుడు’ గొప్ప ఆనందాన్నిచ్చింది: కీర్తి సురేష్

- Advertisement -