భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరైన తమన్నా భాటియా తరచూ తన స్టైల్ మరియు ఫిట్‌నెస్ తో స్పాట్‌లైట్‌లో నిలుస్తూ ఉంటుంది.
ఇటీవల ఆమె బరువు విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ, తనదైన రీతిలో విమర్శకులకు సమాధానం చెప్పింది. క్రమమైన వర్కౌట్స్ మరియు కఠినమైన ఫిట్‌నెస్ రీజీమ్ పాటించడం ద్వారా తమన్నా అదనపు కిలోల బరువు తగ్గి మళ్లీ ఫిట్‌గా మారింది.
తాను మరింత సన్నగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, రాబోయే ప్రదర్శనల్లో మరింత టోన్డ్ మరియు స్కల్ప్ట్‌డ్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరచాలని ప్లాన్ చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ. ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ Do You Wanna Partner లో కనిపించిన తమన్నా, ప్రస్తుతం తన ట్రాన్స్‌ఫార్మేషన్‌తోనే హాట్ టాపిక్ అవుతోంది. ఆమె కొత్త లుక్‌ను తెరపై చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read:భారతీయులకు ట్రంప్ మరో షాక్!

