ఖైదీ నెంబర్ 150తో బంపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
చిరుతో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనుందని సమాచారం. ప్రస్తుతం నా నువ్వె సినిమాలో నటిస్తున్న తమన్నా సైరాలో ఐటెం సాంగ్‌లో నటిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి.
అయితే తమన్నాను ఐటెం సాంగ్ గురించి సినిమాలో తీసుకోలేదని ఆమె పాత్ర కీలకంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉయ్యలవాడ నరసింహారెడ్డి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే మహిళగా కనిపించనుందని తెలిపారు.
ఇటీవలె నానక్‌రామ్‌గూడలో వేసిన భారీ సెట్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంది. నయనతారతో కలిసి ఓ యజ్ఞం నిర్వహిస్తున్న చిరంజీవి లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. పక్కనే కూర్చున్న గురువు అమితాబ్ ఈ మహా కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదిరిపోయే క్యాస్టూమ్స్‌తో చిరంజీవి, నయనతార లుక్స్.. కన్నార్పకుండా చూసేలా, అభిమానులు పండగ చేసుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.