ఓ వైపు మెగాస్టార్, మరోవైపు సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతో తన కల నెరవేరిందని మిల్కీ బ్యూటీ తమన్నా పేర్కొంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో, జైలర్ లో రజనీకాంత్ తో వెండితెరను పంచుకోవడం తన జీవితంలో గుర్తుండిపోయే అనుభవమని తమన్నా చెప్పుకొచ్చింది. భోళా శంకర్, జైలర్ సినిమాలు రెండు ఒక రోజు గ్యాప్ లో విడుదల కానుండడంతో ఆనందం, ఉద్వేగం రెండూ కలుగుతున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకే సారి ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన, రజనీకాంత్ సరసన నటించి మెప్పించబోతుంది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ‘నేను ఏదైనా ముక్కు సూటిగానే మాట్లాడతాను. ప్రేమ విషయాన్ని నాకు నేనుగానే బయటపెట్టాను. పెళ్లి గురించి ఆలోచించే తీరికలేదు. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తా అని చెప్పింది. పెళ్లి కుదిరితే ఏమిటి? ఆల్ రెడీ విజయ్‌వర్మతో ఫుల్ డేటింగ్ లో ఉంది. పైగా అతనితో కలిసే ఉంటుంది. మరి ఇంకా పెళ్లి కుదరాలి అని అంటుంది ఏమిటి? అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇదే విషయాన్ని మీడియా కూడా అడిగితే.. తమన్నా క్లారిటీ ఇచ్చింది. విజయ్వర్మతోనే తన పెళ్లి డేట్ ఫైనల్ అయ్యాక.. అందరికీ చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా విజయ్‌వర్మతో తన రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇంట్లో స్త్రీలతో పాటు బయటివారితోనూ ఎంతో గౌరవంగా ఉంటారు. అందుకే అతను నా మనసుకు దగ్గరయ్యారు. నేటి యువతకు మహిళలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు చెప్పాలి. విజయ్ నా జీవితంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని తమన్నా తెలిపింది.
Also Read:‘ఖుషీ’ సెన్సార్ పూర్తి..రన్ టైమ్ అంతే