చాలా మంది నిర్మాతలు తనతో పనిచేసేందుకు ఇష్టపడతారని మిల్కీబ్యూటీ తమన్నా తెలిపింది. ఏదైనా సినిమాను ఒప్పుకుంటే అది విడుదలయ్యే వరకు కష్టపడి పనిచేస్తూ, ప్రతిరోజూ నిర్మాతలతో ఫోన్ ద్వారా టచ్‌లో ఉంటానని చెప్పింది.ఓ మూవీ ప్రమోషన్‌కు తమన్నాపై రాకపోవడంతో ఆ మూవీ నిర్మాత కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలేనని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి కంప్లైంట్ రిజిస్టర్ కాలేదని తెలిపింది. ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా తన ఎదుగుదలను అడ్డుకోలేరని తేల్చి చెప్పేసింది తమన్నా.
బాలీవుడ్‌లో ఆఫర్‌లు వస్తున్నాయి కదా అని దక్షిణాదిని వదిలిపెట్టనని చెప్పేసింది. తన కెరీర్ ప్రారంభమైంది తెలుగు, తమిళ ఇండస్ట్రీలతోనేనని అందువలన ఆ రెండు ఇండస్ర్టీలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపింది. తనకు ఏ భాషలో నటించడానికైనా ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ హిందీ సినిమాల్లో నటిస్తే నా స్నేహితులు, బంధువులకు ఆ సినిమాలను చూపించి గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది.