మూడురోజులే అంటున్న మిల్కీ బ్యూటీ..!

217
Tamanna Bhatia interview
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా పదేళ్ల కెరీర్‌లో మూడు పరిశ్రమల్ని చుట్టేసింది. తీరికనేదే లేకుండా పనిచేస్తు పరుగు తీస్తుంది. అయినా అలుపు మాత్రం లేదంటోంది. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అలసట దరి చేరదనేది ఆమె మాట. ఈ ప్రయాణంలో కాస్త విరామం తీసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? అని అడిగితే ‘‘నా శరీరం అలసిపోతుందేమో కానీ.. మనసు మాత్రం ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ నేను విరామం తీసుకొన్నా అది కేవలం మూడు రోజులే.

Tamanna Bhatia interview

ఆ తర్వాత నాకు నేనే బోర్‌ కొట్టేస్తా. ఆ మూడు రోజులు కూడా స్నేహితుల్ని కలవడం, కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లడంలాంటి పనులు చేస్తుంటా. విరామం పేరుతో ఏ పనీ పాట చేయకుండా ఇంట్లో కూర్చోవడం మాత్రం నావల్ల కాదు. మనసు ఎప్పుడూ ‘తర్వాతేంటి?’ అని ప్రశ్నిస్తుంటుంది. నాకు ఎక్కువగా సంతోషాన్నిచ్చేది ఆ ప్రశ్నే. అయితే ఇదివరకటితో పోలిస్తే ఈమధ్య కాస్త ఆచితూచి అడుగులేస్తున్నా. తొలినాళ్లలో అయితే ఉంటే ప్రయాణంలో లేదంటే సెట్లోనే. అంతగా పనిచేశా. అలాంటి రోజుల్లోనూ ఎప్పుడూ కష్టపడుతున్న భావన కలగలేదేంటో’’ అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె కల్యాణ్‌రామ్‌తో కలసి ఓ చిత్రంలో నటిస్తోంది.

- Advertisement -