బోల్డ్ సీన్స్‌పై తమన్నా క్లారిటీ!

13
- Advertisement -

హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ మిల్కీ బ్యూటీ తమన్నా. ఇండస్ట్రీలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్న అదే స్టార్‌డమ్‌ని కంటిన్యూ చేస్తోంది తమన్నా. ప్రస్తుతం సినిమాలతో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది తమన్నా.

లస్ట్ స్టోరీలో హద్దులు చెరిపేసి రెచ్చిపోయిన తమన్నా తాజాగా ‘లస్ట్ స్టోరీ 2’ సిరీస్‌లో విజయ్‌ వర్మకు జోడీగా నటిస్తోంది. ఈ సరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బోల్డ్ గా నటిస్తే తప్పేంటని.. లస్ట్ స్టోరీస్ సీజన్‌ 1 చూశాక తన అభిప్రాయమే మారిపోయిందదని చెప్పుకొచ్చింది. ఆడియన్స్ కూడా ఇలాంటివే చూస్తున్నారని.. ఇలాంటి సిరీస్‌లు.. సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి కాలంతో పాటు అందరూ మారే స్టేజ్‌కి వచ్చారని సమర్ధించుకువచ్చింది. ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని లేట్‌గా తెలుసుకున్నానని అభిప్రాయపడింది. బోల్డ్ సీన్స్‌పై తమన్నా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read:నటనకు నిర్వచనం…ఎన్టీఆర్

- Advertisement -