మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ వాటర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నింటికన్నా నీటికీ చాలా ప్రాధాన్యం ఇస్తూ సనత్ నగర్ నియోజకవర్గంలో వాటర్ రిజర్వాయర్ కట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే విధంగా మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని మంత్రి అన్నారు.
దాన కిషోర్ జనాలు వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన టెక్నాలజీ ద్వారా పని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అందరి సహకారంతో మంచి మంచి కార్యక్రమలు చేసుకుంటున్నాం. నియోజకవర్గంలో అన్ని పార్కులకు నిధులు కేటాయిస్తూ సుందరంగా తీర్చిదిద్దాం. రాబోయే రోజులలో కొన్ని ప్రాంతాలలో రోడ్లు కూడా వేసేందుకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు మంత్రి తలసాని.
హైదరాబాద్ లోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఉండాలన్నదే నా కల…సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పూర్తిగా సమస్యలు లేని సనత్ నగర్‌గా చేయడానికి కృషి చేస్తా. 25 లక్షలు ఆర్థిక సహాయం అందించిన సోషల్ వర్కర్ వేణుని ప్రజల తరపున అందిస్తున్నాను. కులమతాలకు అతీతంగా అన్ని మతాలకు దేవాలయాలు, మాజిదు,చర్చిలను అన్నింటిని సుందరంగా తీర్చుదిద్దుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. సనత్ నగర్‌లో అనేక కార్యక్రమాలు చేసి మంచి పథకాలను అమలు చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని అభినందిస్తున్నా…ఈ నియోజకవర్గంలో వాటర్ సమస్య ఉండకుండా 7.50 కోట్లతో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాన కిషోర్ చెప్పిన అనేక అంశాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్ధవంతంగా పూర్తి చేసే డైనమిక్ ఆఫీసర్లు ప్రభుత్వంలో ఉన్నారు అని ఎమ్మెల్సీ అన్నారు.