విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.. కుటుంబన్ని ఆదుకున్న మంత్రి తలసాని..

574
Talasani Srinivas Yadav
- Advertisement -

సనత్ నగర్ నియోజకవర్గంలోని అశోక కాలనీకి చెందిన 18 ఏళ్ల శివాజీ గత రాత్రి సుభాష్ నగర్‌లో విద్యుత్ ఘాతంతో మరణించారు. శివాజీ మృతదేహాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుడి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా కింద ఇస్తున్నట్టు ప్రకటించారు.5 లక్షల రూపాయలు విద్యుత్ శాఖ ద్వారా, మరో రెండు లక్షల రూపాయలు జిహెచ్ఎంసి మేయర్ నిధుల నుండి అందజేస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -