కేటీఆర్‌తో మంత్రి తలసాని భేటీ

228
talasani
- Advertisement -

తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిశారు. ప్రగతిభవన్‌లో ఇవాళ ఉదయం కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన తలసాని తనకు మంత్రిపదవి దక్కడంలో కృషిచేసిందుకు అభినందనలు తెలిపారు. తలసానితో ఆయన తనయుడు సాయి కిరణ్..కేటీఆర్‌కి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా తలసానిని అభినందించారు కేటీఆర్.

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న కేటీఆర్ ఉమ్మడి రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఎల్బీనగర్‌,మహేశ్వరం తప్ప మిగితా స్థానాల్లో ఎంఐఎం,టీఆర్ఎస్‌ గెలుపొందాయి.

talasani trs

తలసాని గెలుపులో కీలకపాత్ర పోషించారు కేటీఆర్. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం గ్రేటర్‌లో మాస్‌ లీడర్‌గా ఉన్న తలసానికి మంత్రిపదవి దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు తలసాని.

ktr talasani

- Advertisement -