ర్యాలీకి అనుమతించి..అరెస్ట్ చేస్తారా?

8
- Advertisement -

సికింద్రాబాద్ ప్రాంతంలో వేలాది మంది తో శాంతియుత ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం…ర్యాలీ కి అనుమతి కోరడం అనుమతి ఇవ్వడం జరిగింది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్.రాత్రి ర్యాలీ కిననుమతి లేదని చెప్పారు…అల్ప హోటల్, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను పెట్టారు అన్నారు.

వందలాది మందిని అరెస్ట్ చేశారు… ఇది ప్రజాస్వామ్యం మా… మేము శాంతియుత ర్యాలీ చేస్తాం అంటే ఇదెక్కడి రాజ్యం చెప్పాలన్నారు. నల్ల జెండాలు,నల్ల కండువా లు తో ర్యాలీ చేస్తాం అంటే ఇలా అణిచివేయడం ఎట్లా….సికింద్రాబాద్ ను మేము పట్టుకోలేదు అంటూనే మిగతా ప్రాసెస్ చేస్తున్నారు…మేము 5రోజుల ముందే మేము అనుమతి కోరుతూ పోలీసులను కలిశాం అన్నారు.

కానీ నిన్న అర్ధరాత్రి అనుమతి నిరాకరణ అంటే ఎలా…. 200ఏండ్ల చరిత్రను చెరిపి వేస్తాం అంటే చూస్తూ ఊరుకోం….వచ్చే నెల మొదటి వారంలో మేము కోర్టుకు వెళ్తాం మేము శాంతియుత ర్యాలీ చేస్తా..ట్విన్ సిటీస్ అని హైద్రాబాద్, సికింద్రాబాద్ అని ఉన్నాయి.మా అస్తిత్వ పోరాటం ఇది.మా ఇంటి దగ్గర కు వచ్చి అరెస్ట్ చేస్తాం అంటున్నారు.నిన్న పోలీసులు ర్యాలీ కోసం రోడ్డు ,రూట్ మ్యాప్ పరిశీలించారు.అన్ని వర్గాల ప్రజలు,అన్ని సంఘాలు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు అన్నారు.

ఇలా చేయడం ప్రభుత్వం కు మంచిది కాదు …ఇవాళ ర్యాలీ నీ ఏపీ పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ భవిష్యత్తులో మేము మళ్ళీ ర్యాలీ చేస్తాం అన్నారు..

Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

- Advertisement -