- Advertisement -
గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని… గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదన్నారు.
ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారు? అని ప్రశ్నించారు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు.
గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, మాకు తెలుసన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా? అని ప్రశ్నించారు.
- Advertisement -