హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు అన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్. గూగుల్ మ్యాప్ ఆధారంగా విభజించినట్లున్నారు..హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది..సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉంది..ఇష్టం వచ్చినట్లు విభజన చేస్తున్నారు..దీనికి వ్యతిరేకంగా 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అన్నారు.
మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసనలు తెలియజేస్తాం..టెక్నికల్ స్టడీ లేకుండా ప్రాంతాలను విభజిస్తున్నారు…జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారు..సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు..సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.రేవంత్ రెడ్డి.. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడండి..మహానగర విభజన పై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదు..డివిజన్లను కూడా సరిగా విభజించ లేదు..24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు..ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బిఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశాం..రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుంది..ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు అన్నారు.
దీనిపై చట్టపరంగా న్యాయపరంగా పోరాడతాం..అసెంబ్లీలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు..ఎంతోమంది ముఖ్య మంత్రులను, స్పీకర్లను చూశాం…ఇలాంటి ముఖ్యమంత్రిను, స్పీకర్ని చూడలేదు…స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడడం లేదు..ప్రజా సమస్యలపై పోరాడడం ప్రతిపక్ష పార్టీ పని..స్పీకర్ ప్రతిపక్ష పార్టీని నిలువరిస్తున్నారు…గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్న స్పీకర్ అడ్డు చెప్పలేదు..శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా వత్తాసు పలికేల వ్యవహరిస్తున్నారు..రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదు…అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే… అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదు అన్నారు శాసన సభ విప్ కేపీ వివేకానంద గౌడ్. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు..పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి అయిపోయింది…కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం విభజనపై గొంతెత్తుతున్నారు..ఎమ్మెల్యే మల్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపారు…కుక్కలు చించిన విస్తరిలా హైదరాబాదును మార్చే ప్రయత్నం చేస్తున్నారు..గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేరు.. విభజనపై మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లతో కనీసం సంప్రదించలేదు…జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాల్లో కూడా దీనిపై సమగ్ర చర్చ జరగలేదు..దొంగ చాటున హైదరాబాద్ మహ నగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు..పరిపాలన సాలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజనులు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం…ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు… రేవంత్ రెడ్డి మహానగర విభజనను గందరగోళంగా చేస్తున్నారు..దీనిపై ప్రజా పోరాటం చేస్తాం అన్నారు.
Also Read:ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన..ట్రంప్ హెచ్చరిక!

