రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.రైల్వే స్టేషన్ నుంచి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది… ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు రావాలి అన్నారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్…అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయి అన్నారు.
లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉంది..సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది…కమిషనరేట్ లు అక్రమంగా కలిపారు..ఎందుకు కలిపారో చెప్పాలి…రేపు అన్ని రంగాల సంఘాలు పాల్గొనాలి అన్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం..రేపు కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు..సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది అన్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారు…ఆ హామీలు అమలు చేయకుండా పేర్లు ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారు…లష్కర్ సాధన సమితి రెండేళ్లుగా అడుగుతున్నాం అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలి..అన్ని రాజకీయ పార్టీలు కచ్చితంగా ఈ కార్యక్రమం లో పాల్గొనాలి..ఇది శాంతియుత ర్యాలీ..ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం..ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం అన్నారు.
Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

