బండి సంజయ్‌పై మంత్రి తలసాని ఆగ్రహం..

139
Talasani
- Advertisement -

బండి సంజయ్ వ్యాఖ్యలను కండిస్తున్నాము. ఎంపీగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మల్లా రెడ్డి,విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కరోనా విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎం చేస్తుందో కేంద్రాన్ని సంజయ్ అడగాలి అన్నారు.

ఒకపార్టీ అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్ చీప్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాలి మాటలు మాట్లాడటం చాలా సులువు- ప్రభుత్వంలో ఉంటే బాధ్యత ఏంటో తెలుస్తుండే అని ఎద్దేవ చేశారు. ప్రధానిపై మేము విమర్శలు చేస్తే గ్లోబల్ లెవల్‌లో ఆయనకే చిన్నచూపు అవుతుంది. బండి సంజయ్ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఈటెల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది అని మంత్రి తలసాని తెలిపారు.

బాల్క సుమన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ లెక్క మేము మాట్లాడగలం.. కానీ రాజకీయంలో ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. సంజయ్ ది నోరా తాటి మట్టనా!. సీఎంకు కరోనా వచ్చినా రోజు కోవిడ్‌పై మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారో రేపు నాగార్జున సాగర్ ఫలితాలు తెలుస్తుంది. బండి సంజయ్‌కి దమ్ము ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఎమ్మెల్యేలు మంత్రులపై బండి సంజయ్ వ్యాఖ్యలను కండిస్తున్నామని సుమన్‌ పేర్కొన్నారు.

- Advertisement -