పహల్ గాం లో ఉగ్రదాడిని ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహమూద్ అలీ ,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు తలసాని. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల దాడిని సీరియస్ గా తీసుకోవాలి అన్నారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.. దేశం గురించి ఆలోచించాలంటే ఉగ్రవాదులు భయపడాలి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్.. స్వయంపాలన కోసం బిఆర్ఎస్ పోరాటం చేసింది అన్నారు. 1969 ఉద్యమాన్ని చాలామంది చూడలేదు.. 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఒప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారు..కేసీఆర్ ఆమరణ దీక్షతోనే చిదంబరం ప్రకటన వచ్చింది అన్నారు.
సీఎం అయ్యాక ఎవరూ ఊహించని రీతిలో కేసీఆర్ సంక్షేమ పధకాలు ఇచ్చారు.. దేశంలో అధునాతన సెక్రటేరియట్ ను కేసీఆర్ సీఎంగా కట్టారు అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,అమరవీరుల స్థూపం, జిల్లాల కలెక్టరేట్లు,ఎస్పీ ఆఫీసులు కేసీఆర్ కట్టారు అన్నారు. దేశ చరిత్రలో నిలిచే విధంగా బిఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుంది… గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుండి 50వేల మంది బహిరంగ సభకు వెళ్లబోతున్నాం అన్నారు.
సభ తర్వాత రాజకీయ ప్రభావం ఉంటుంది.. త్వరలో బిఆర్ఎస్ మెంబర్ షిప్ కార్యక్రమం,కమిటీల నియామకం ఉంటుంది అన్నారు.
Also Read:లిక్కర్ కల్తీ..పట్టుకున్న అధికారులు!

