తలసాని ఇంట విషాదం..కేసీఆర్ సంతాపం

11
- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొంది. తలసాని సోదరుడు, మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్… సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

తలసాని శంకర్ మృతిపట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక శంకర్ బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

Also Read:శివకార్తికేయన్‌కు విలన్‌గా విద్యుత్‌ జమ్వాల్‌

- Advertisement -