అతి చిన్న వయసులో లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ..

268
Talasani Sai Kiran Yadav
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారైంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ అతి చిన్న వయస్కుడు కావడం విశేషం.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనందరికీ సుపరిచితులే.. ఆయన కుమారుడే తలసాని సాయికిరణ్ యాదవ్ (33). 1986లో మే 13న ఇయన జన్మించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో ఎంబీఏ చదివారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆశాకిరణ్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

Talasani Sai Kiran Yadav

సాయికిరణ్ తలసాని సాయి సేవాదళ్‌ను ప్రారంభించి సనత్‌నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. తండ్రి బాటలోనే రాజకీయ అడుగులు వేస్తున్నాడు తలసాని సాయికిరణ్ యాదవ్ .

ఇక తనను లోక సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధించడానికి కేసీఆర్ ఎంతగానో పోరాడారని, రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారన్నారు. ఎంతో మంది దిగ్గజ నేతలు ఉండగా తన లాంటి యువకుడికి కేసీఆర్ యువతను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో లోక్‌సభ టికెట్ కేటాయించారని సాయికిరణ్ స్పష్టం చేశారు.

- Advertisement -