బీసీ గణన తప్పుల తడక: తలసాని

1
- Advertisement -

బీసీ గణన తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ..ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు అన్నారు.

షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ?..కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ?…మమ్మల్ని సభకు పిలిచి అవమానించారు ..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు ..స్పీకర్ సభ ను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా ?..సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితం అన్నారు.

సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయం ..నాలుగు రోజులు అయినా సభ పెట్టాలి …బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ..బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు ..బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతోంది ..తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోందన్నారు.

Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -