Takshakudu:తక్షకుడు టీజర్

4
- Advertisement -

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘తక్షకుడు’ టీజర్ తాజాగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత దర్శకుడు వినోద్ అనంతోజుతో ఆనంద్ చేస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

టీజర్ చూస్తే ఇది పక్కా రివెంజ్ డ్రామాగా తెలుస్తోంది. పెళ్లి రోజే కుటుంబాన్ని కోల్పోయిన యువకుడు, తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే కథే ప్రధానంగా కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

నితాన్షీ గోయల్ హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Also Read:మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

- Advertisement -