ABN న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో తనకు జరిగిన అవమానకర ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఛానల్ ఆహ్వానం మేరకు అతిథిగా డిబేట్‌కు హాజరైన తనను, ఒక ఎమ్మెల్సీ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా యాంకర్ “గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్” అంటూ అవమానించారని ఆయన తెలిపారు. ఈ సంఘటన తన మనసును తీవ్రంగా బాధించిందని అన్నారు.
ఒక ప్రజాప్రతినిధి పట్ల, అతిథి పట్ల ఈ తరహా ప్రవర్తన దుర్మార్గమని విమర్శించారు. యాంకర్ తన పట్ల అంత అక్కసుగా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్. రమణ, నవీన్ కుమార్ రెడ్డి కూడా చైర్మన్‌ను కలిసి సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:‘ఓ..! సుకుమారి’..యాదగిరిగా తిరువీర్

