అల్లం గురించి మనందరికి తెలిసిందే. వంటకాలలో రుచిని పెంచడంలో అల్లం పాత్ర చాలా ఉంటుంది. కేవలం వంటకాల్లోనే కాకుండా అల్లం టీ, అల్లం రసం, వంటి వివిద రకాల పానీయాలలో కూడా అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనలు అన్నీ ఇన్ని కావు. ఆయుర్వేద శాస్త్రంలో అల్లాన్ని దివ్యౌషధంలా పరిగణిస్తారు. అల్లం ఎన్నో రోగాల నివారణలో సమర్థవంతంగా పని చేస్తుంది. పిత్తాశయ సమస్యలను దూరం చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఆకలి లేమిని దూరం చేస్తుంది. అలాగే వేవిళ్లు, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇక అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు దగ్గు జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి.
Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!
ఇక స్త్రీలలో అల్లం తినడం వల్ల పిరియడ్స్ లో వచ్చే సమస్యలు దూరం అవుతాయి. అయితే అల్లం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అల్సర్ ఉన్నవాళ్ళు అల్లానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పడగడుపున అల్లం వంటకాలు తినడం గాని లేదా అల్లం టీ తాగడం గాని, చేయకూడదు. ఇలా చేయడం వల్ల అల్సర్ ఉన్న వాళ్ళలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు కూడా అల్లానికి దూరంగానే ఉండాలి. గర్బిణి మహిళలు కూడా అల్లం కలిగిన పదార్థాలను తినడం వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకే అల్లం కలిగిన ఆహార పదార్థాలను తినవలసి ఉంటుంది. ఇక అల్లం అధిక వినియోగం కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట. అందువల్ల అల్లం పట్ల ఎంతో జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.