రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు 

502
Thahasildar
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్లను బదిలీలు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తహశీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్ 5 లో 166 మంది, జోన్ 6 లో 212 మంది, మొత్తం 378 మంది తహశీల్దార్ల రిపాట్రియేషన్. సాధారణ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 2018 లో తహశిల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

తహశీల్దార్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.తహశీల్దార్ల రిపాట్రియేషన్ ప్రొసీడింగ్స్ ను విడుదల చేశారు సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ప్రత్యామ్నాయాల కోసం వేచి చూడకుండా తహశీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రిపాట్రియేట్ అయిన తహశీల్దార్లు రేపటికల్లా జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈసందర్భంగా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ట్రెసా ఆఫీస్ బేరర్లు.

- Advertisement -