30 ఏళ్ల అయినా ఇప్పటికీ అలాగే ?, టబు అందం గురించి కొత్తగా వర్ణనలేమి అక్కర్లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరికీ టబు సొంగసుల గుమగుమలు సుపరిచితమే. అమ్మడు తొలి సినిమా నుంచి ఏ మాత్రం మొహమాటం లేకుండా వెండితెర పై తన అందాల ముద్రను గుద్దుతూనే ఉంది. హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రోజుల్లో టబు పెళ్లి చేసుకోవాలనుకుంది. హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించిన టబుకు, ప్రముఖ నటుడు బాబా అజ్మీల బంధువు అవుతారు. ఆయనే దగ్గర ఉండి హైదరాబాద్ సంబంధమే చూశారు. ఇదంతా 20 ఏళ్ల క్రితం మాట.
అప్పుడు ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ తర్వాత టబు మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. కానీ, టబు ఏంటా వేడి? అనేలా ఎక్స్ పోజింగ్ లో మాస్టర్స్ చేసింది. మతి చెదిరేలా సినిమాలు చేసింది. ‘నేను కుటుంబ జీవితంలో స్థిరపడకపోయినా.. నేను పిల్లల్ని కనకపోయినా.. కాపురం లో బిజీ కాలేకపోయినా ఎప్పుడు బాధ పడలేదు అంటూ నేటికీ చాలా బోల్డ్ గా చెబుతుంది టబు. ఐతే, తాజాగా ఈ ముదురు అమ్మడు ఇప్పటికీ పెళ్లి ఆలోచనలు చేస్తోందట. ఓ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. గత కొన్ని నెలలుగా ఓ బిజినెస్ మెన్ తో టబు రిలేషన్ లో ఉందట.
లేటు వయసులో ఘాటు రిలేషన్ లో ఉండటం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. ఐతే, అంత బిజిలోనూ టబు నిత్యం అభిమానులకు టచ్ లో ఉండటం అంటే గ్రేట్ అనే అనాలి. అన్నింటికి మించి బ్యూటీ విషయం లో 30 ఏళ్ల క్రితం నాటి బ్యూటీని ఇప్పటికీ టబు ఎక్కడా చెక్కు చెదరనివ్వలేదు. అదే లుక్..అదే గ్లామర్ మెయింటెన్ చేస్తూ టబు ఇంకా అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. తాను అభిమానుల్ని కవ్వించడంలో ఏ మాత్రం తగ్గనంటోంది. ఏది ఏమైనా టబు ఏం చేసినా ప్రతీది సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది. అందుకే, టబు ఆల్ట్రామోడ్రన్ లుక్ లోనూ సూపర్బ్ అందాలను వెదజల్లుతూ ఉంటుంది.
Also Read:పిక్ టాక్ : భారీ అందాలతో కుదిపేసింది