‘నిన్నే పెళ్లాడుతా’, ‘ప్రేమదేశం’ ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగించింది టబు. ఎక్స్‌పోజింగ్ చేయడానికైనా సై అన్న టబు.. దక్షిణాది చిత్రాల్లో సైతం తన అందాలను ఆరబోసింది.అటు గ్లామర్ పాత్రల్ని, ఇటు నటనకి పెద్ద పీట వేసే పాత్రల్ని సమర్థంగా పోషించగల అతి కొద్దిమంది నటీమణుల్లో టబు ఒకరు. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయిన టబు.. వయసు 45 దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే తాను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. బాలీవుడ్ హీరో అజయ్‌దేవగణ్ కారణమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇంకా ఏం చెప్పిందంటే ‘గతంలో మా కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడు. అజయ్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అప్పట్లో నేను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అవుతూ ఉండేవాడు. నన్ను ఓ కంట కనిపెడుతూ ఉండేవాడు. వేరే అబ్బాయిలు నాతో మాట్లాడినా, నన్ను చూసినా వాళ్లను కొట్టేవాడు. అజయ్ వల్లే ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయా. ఈ విషయాన్ని అతను ఇప్పటికైనా తెలుసుకుంటాడని ఆశిస్తున్నా. హీరోల్లో నాకు అజయ్ అంటేనే ఇష్టం. మా బంధం చాలా స్పెషల్. నేను చిన్నపిల్లలా ప్రవర్తించినా అజయ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడ’ని చెప్పింది టబు. అజయ్‌తో తనది ప్రత్యేకమైన అనుబంధమని, అతని వల్లే తను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదంది. కాగా, బాలీవుడ్ స్టార్ కాజోల్ అజయ్‌దేవ్‌గన్ లు పెళ్లి చేసుకొని.. బాలీవుడ్ స్టార్ కపుల్‌గా పిలవబడుతున్న సంగతి తెలిసిందే.