సిస్టర్ ఫ్రాన్సెస్కోగా టబు!

9
- Advertisement -

టబు..ఒకప్పుడు సౌత్‌ను ఊపేసిన నటి. అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన టబు..రీసెంట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక తాజాగా ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ డ్యూస్ ప్రాఫెసీలో నటించనుంది.

2019లో అనౌన్స్ అయిన ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. డ్యూన్: ప్రాఫెసీ అనేది ఓ అమెరికన్ టీవీ సిరీస్. ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ డ్యూన్ ప్రపంచ నేపథ్యంలోనే ఈ సిరీస్ ను చిత్రీకరించారు. ఇందులో బాలీవుడ్ నటి టబు కీలకమైన పాత్రలో నటిస్తోంది.

బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జే ఆండర్సన్ రాసిన సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. డ్యూన్: పార్ట్ వన్, డ్యూన్: పార్ట్ టూగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సినిమా డ్యూన్: ప్రాఫెసీ సిరీస్ కూడా తెరకెక్కుతోంది.

Also Read:వారణాసిలో మోడీ..నామినేషన్ దాఖలు

- Advertisement -