మహేష్‌పై మనసుపడ్డ టబు

260
- Advertisement -

అందానికి నిలువెత్తు రూపం టబు… టాలీవుడ్ లో ఒకప్పుడు సెక్సీ హీరోయిన్‌ గా గుర్తింపు పొందిన టబు ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో నిలిచిపోతారనే చెప్పాలి. ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ అందాలు ఆరబోస్తూ యూత్‌ కు పిచ్చెక్కించేస్తోంది టబూ.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ మాంచి జోరుమీద ఉంది టబు. అయితే టబుపై ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

మహేష్‌ మూవీలో ఒక ఆంటి పాత్రలో టబు నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమాలో టబు మహేష్‌ పై మనసుపడే ఆంటీ అని తెలుస్తోంది. మహేష్‌ కు దగ్గరకావాలని ఆశపడే క్యారెక్టర్‌ లో టబు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం అన్నది తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.

- Advertisement -